![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -733 లో.....అప్పు, కళ్యాణ్ ల శోభనం కోసం రాజ్, కావ్య ఏర్పాట్లు చేస్తుంటారు. అప్పు, కళ్యాణ్ ఇద్దరు కలసి కావ్య రాజ్ దగ్గరికి వస్తారు. నేను అర్జెంట్ గా స్టేషన్ కి వెళ్ళాలి. లేదంటే నా జాబ్ పోతుందని అప్పు చెప్తుంది. అందరు కలిసి దానికి సొల్యూషన్ ఆలోచిస్తారు.
అందరు మిమ్మల్ని శోభనం గదిలోకి పంపిస్తారు కదా.. లోపలికి వచ్చాక వెనకాల డోర్ నుండి అప్పు, కళ్యాణ్ వెళ్లిపోండి. మళ్ళీ త్వరగా వచ్చి మీ గదిలో ఉండండి అని రాజ్ చెప్తాడు. దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ ఇద్దరు హాల్లోకి వస్తారు. గదిలో ఉండకుండా అక్కడ ఏం చేస్తున్నారని ధాన్యలక్ష్మి అడుగుతుంది. రెడీ అయ్యాం అలా గార్డెన్ లోకి వెళ్ళామని కళ్యాణ్ అంటాడు. అప్పుని పాల గ్లాస్ తో కళ్యాణ్ దగ్గరికి ఇంట్లో వాళ్ళు పంపిస్తారు. సారీ కళ్యాణ్ నిన్ను బాధపెడుతున్నానని అప్పు అంటుంది. అప్పుడే వెనకాల డోర్ నుండి రాజ్, కావ్య వచ్చి అప్పు కళ్యాణ్ ని బయటకు పంపిస్తారు. అప్పు, కళ్యాణ్ కావ్య గదిలో నగలు పెట్టి మాములు డ్రెస్ లో వాళ్ళు బయటకు వెళ్తారు. అదంతా రాహుల్ చూసి ఇది కదా కరెక్ట్ టైమ్ అని అనుకుంటాడు.
ఆ తర్వాత కళ్యాణ్, అప్పు వెళ్తుంటే దూరం నుండి ధాన్యలక్ష్మి చూసి..కళ్యాణ్ లా ఉన్నాడేంటని అనుకుంటుంది. తరువాయి భాగం లో అప్పు, కళ్యాణ్ ఇంటికి వచ్చి ఎవరు చూడకుండా పైకి వెళ్ళాలనుకుంటారు. అప్పుడే ధాన్యలక్ష్మి చూస్తుంది. ఆ తర్వాత అందరు కలిసి రాజ్ కావ్య ఉన్న గదిలోకి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |